పుట్టా దంపతుల చేతుల మీదుగా వరికోత యంత్రం ప్రారంభం
రైతులకు దసరా శుభాకాంక్షలు తెలిపిన పుట్టా మధూకర్, శైలజ దంపతులు
రైతులు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష
మల్హర్ ,అక్టోబర్ 21 (చక్రవాణి న్యూస్) :దసరా పండుగను పురస్కరించుకుని మల్హర్ రావు మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన అప్పాల కొమురయ్య, రవి యాదవ్, రాజ్‌కుమార్ యాదవ్‌ల నూతన వరికోత యంత్రాన్ని బుధవారం మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధూకర్, ఆయన సతీమణి శైలజ దంపతులు మంథనిలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యంత్ర యజమానులకు, గ్రామ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.ఈ దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని, ఆయురారోగ్యాలతో పాటు మంచి ఫలితాలు సాధించాలని పుట్టా మధూకర్ దంపతులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రుద్రారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

