పోచంపల్లి పీహెచ్సీలో సైకో వీరంగం సీసీ కెమెరాలో ఘటన దృశ్యాలు.. వైద్య సిబ్బంది నిరసన
భూదాన్ పోచంపల్లి అక్టోబర్ 1(చక్రవాణి న్యూస్) : భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం వైద్యురాలిపై దాడి ఘటన కలకలం రేపింది. మహమ్మాయ కాలనీకి చెందిన దుద్యాల వెంకట తిరుపతి కాలికి గాయంతో చికిత్స కోసం పీహెచ్‌సీకి వచ్చాడు. వైద్యురాలు శ్వేత పరీక్షించి మందులు సూచించిన అనంతరం ఆమెపై దాడి చేసినట్లు సీసీ కెమెరా దృశ్యాల్లో నమోదైనట్లు సమాచారం.అడ్డుకునేందుకు వచ్చిన సిబ్బందిపైనా దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. అనంతరం డాక్టర్ స్టెతస్కోప్‌ను తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ఘటనపై వైద్య సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.వైద్యురాలిపై దాడిని నిరసిస్తూ పీహెచ్సీ సిబ్బంది నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
