అక్టోబర్ 15 నుంచి వర్షాలు దంచికొట్టే అవకాశం!
తెలుగు రాష్ట్రాల వైపు ఈశాన్య రుతుపవనాలు.. కోస్తాంధ్రలో భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు.. రైతులు అప్రమత్తంగా ఉండాలి
హైదరాబాద్, చక్రవాణి డిజిటల్ న్యూస్ : తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల నిష్క్రమణ నేపథ్యంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో అక్టోబర్ 15 నుంచి కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ అంచనా వేసినట్లు సమాచారం. బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, తేమతో కూడిన గాలుల ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. తెలంగాణలోనూ రానున్న రోజుల్లో వర్షాల పరిస్థితులను గమనించాల్సి ఉంది. వర్ష సూచన నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
