తేదీ: --/--/----రోజు: --సమయం: --:--:--
BREAKING NEWS
తెలంగాణ తాజా వార్తలు • ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు • దేశవ్యాప్తంగా తాజా వార్తలు • మీ చక్రవాణి న్యూస్ • అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

జాతీయ ఆరోగ్య మిషన్‌లో 33 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..... అక్టోబర్ 3 నుంచి 13 వరకు దరఖాస్తుల స్వీకరణ


భూపాలపల్లి, అక్టోబర్ 1 (చక్రవాణి న్యూస్య) :జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఖాళీగా ఉన్న 33 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సి.హెచ్. మధుసూదన్ తెలిపారు.ఎంఎల్‌హెచ్‌పీ 12, పీడియాట్రిషియన్ 1, జనరల్ ఫిజీషియన్ 1, స్టాఫ్ నర్స్ 9, ల్యాబ్ టెక్నీషియన్ 4, ఎస్టీఎల్‌ఎస్ 1, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్/స్పెషలిస్ట్ ఎడ్యుకేటర్ 1, డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ 1, సెకండ్ ఏఎన్‌ఎం 3 పోస్టులు ఉన్నాయని తెలిపారు.అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 3 ఉదయం 10:30 గంటల నుంచి 13న సాయంత్రం 5 గంటల వరకు ఎఫ్25 బ్లాక్, ఐడీఓసీ, జయశంకర్ భూపాలపల్లిలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.దరఖాస్తు ఫారాలు, పోస్టుల వారీగా అర్హతలు, మార్గదర్శకాలు, ఇతర నిబంధనలు జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నట్లు డీఎంహెచ్‌ఓ తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్‌లోని నిబంధనలను పరిశీలించి నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
Name

MENU MENU

chakravani news chakravani news

SEARCH
Powered by Blogger.

Search This Blog

Life & style

Games

POLITICS$type=left$va=0$count=3

ARCHITECT$type=one$count=3


Gallery

Full width home advertisement

Author Description

Hey there! We are చక్రవాణి న్యూస్ — అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

/gi-fire/ YEAR POPULAR$type=one

Post Page Advertisement [Top]

Comments

Recent

Bottom Ad [Post Page]

Tags

Labels

Travel the world

Advertisement

Climb the mountains