నెక్కొండలో విషాదం.... స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి
నెక్కొండ, అక్టోబర్ 7 (చక్రవాణి న్యూస్): వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పిట్టకాలుబోడు తండాలో బుధవారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యోదయ హైస్కూల్‌కు చెందిన బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందాడు.విద్యార్థులను ఎక్కించుకునేందుకు బస్సు తండాలోకి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. బస్సును ముందుకు తీసుకెళ్తుండగా చిన్నారి ప్రమాదవశాత్తూ బస్సు కింద పడినట్లు పేర్కొన్నారు. డ్రైవర్ గమనించకపోవడంతో బస్సు టైరు చిన్నారిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
