పూల బతుకమ్మకు స్వాగతం.. తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు ప్రతీక బతుకమ్మ!
తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు... తెలంగాణ మలిదశ ఉద్యమకారులు ముడితనపెల్లి ప్రభాకర్
అక్టోబర్ 10(చక్రవాణి డిజిటల్ న్యూస్) :
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ నిలువెత్తు ప్రతీక అని తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు ముడితనపెల్లి ప్రభాకర్ అన్నారు. ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి, మహిళల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందిస్తూ బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ముడితనపెల్లి ప్రభాకర్ తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు మల్హర్ రావు మండల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
