ఎంపీ కొయ్యూరు పర్యటన హాస్యాస్పదం
కార్యకర్తలకు సమాచారం ఇవ్వకుండా పర్యటన ఏమిటి?
కాంగ్రెస్ నాయకులు వేల్పుల మహేందర్
మల్హర్, అక్టోబర్ 28 (చక్రవాణి న్యూస్): పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కొయ్యూరు పర్యటనపై కాంగ్రెస్ బూత్ కమిటీ అధ్యక్షుడు వేల్పుల మహేందర్ విమర్శలు చేశారు. సొంత పార్టీ కార్యకర్తలకు సమాచారం ఇవ్వకుండా పర్యటించడం ఏమిటని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ప్రశ్నించారు.కొయ్యూరు సదర్ రోడ్డు పూర్తి కావడానికి రూ.80 లక్షలు అవసరమని, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చొరవతో పూర్తి అంచనాలు రూపొందించాలని అధికారులు ఆదేశాలు పొందారని తెలిపారు. ఎంపీ హడావుడి పర్యటనలకు పరిమితం కాకుండా, కార్యకర్తలకు సమాచారం ఇచ్చి మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని మహేందర్ సూచించారు.
