చిన్నారి రుద్వేత్కు ఎమ్మెల్యే జీఎస్ఆర్ ఆశీర్వాదాలు
పుట్టినరోజు వేడుకలకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి , అక్టోబరు 16 (చక్రవాణి న్యూస్):
గణపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాళ్లపెళ్లి భాస్కర్‌రావు మనవడు రుద్వేత్ పుట్టినరోజు వేడుకలకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారి రుద్వేత్ను ఆప్యాయంగా ఆశీర్వదించినిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఎమ్మెల్యే రాకతో వేడుకలో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్, భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు దాట్ల శ్రీనివాస్, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, చెల్పూర్ పీఏసీఎస్ చైర్మన్ గండ్ర సత్యనారాయణరెడ్డి, మాజీ మండల కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ చోటు మియా, మాజీ సర్పంచ్ ఒద్దుల విజయ అశోక్‌రెడ్డి, మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు ఎండీ రఫీక్, టేకుమట్ల మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి, సర్పంచులు విడిదినేని అశోక్, కటుకూరి రాధిక శ్రీనివాస్,వీరమల్ల సంపత్‌రెడ్డి, భూక్య సమయ నాయక్, ఎలుకపెళ్లి రమేష్, ఇంజపెల్లి శ్రీనివాస్, ఉపసర్పంచులు ఓరుగంటి కృష్ణ, మొగిలి శంకర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెండ్యాల వెంకటేష్, సమీర్ తదితరులు పాల్గొన్నారు.

