మంత్రి శ్రీధర్‌బాబును విమర్శిస్తే సహించం
బాధితుల పక్షాన కాంగ్రెస్ నిలుస్తుంది
మల్హర్, అక్టోబర్ 19 (చక్రవాణి న్యూస్): మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై బీఆర్ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని యూత్ కాంగ్రెస్ నాయకుడు, చిన్నతుండ్ల సర్పంచ్ గడ్డం క్రాంతి రణదేవ్ హెచ్చరించారు. సోమవారం తాడిచర్లలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంతో పాటు మంథని నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్‌బాబు చేపడుతున్న అభివృద్ధిని ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.శాత్రాజ్పల్లి ఇళ్ల కూల్చివేత బాధితులకు, తాడిచర్ల నిర్వాసితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా తమ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. రాజకీయ విమర్శల పేరుతో మంత్రిపై బురదజల్లే ప్రయత్నాలను మానుకోవాలని హితవు పలికారు.ఈ సమావేశంలో తాడిచర్ల ఉపసర్పంచ్ బొబ్బిలి రాజు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కేసరపు చంద్రయ్య, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మంత్రి రాజసమ్మయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు దుర్గాప్రసాద్, కుంట సదానందం, మేనం శీను, రవి సాగర్, రేవెల్లి లింగయ్య, నరేష్, వేణు, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.
