మేకల అప్పయ్య కుటుంబానికి ఫాక్స్ చైర్మన్ పరామర్శ
మల్లారం సర్పంచ్ మేకల రాజయ్య యాదవ్‌కు చైర్మన్ ఇప్ప మొండయ్య ఓదార్పు
మల్హర్, అక్టోబర్ 23 (చక్రవాణి న్యూస్) :మండలంలోని మల్లారం గ్రామ సర్పంచ్ మేకల రాజయ్య యాదవ్ తండ్రి మేకల అప్పయ్య అనారోగ్యంతో మృతి చెందాగ . విషయం తెలుసుకున్న ఫాక్స్ చైర్మన్ ఇప్ప మొండయ్య, పెద్దతూండ్ల సర్పంచ్ బండారి నర్సింగం, అడువాలపల్లి మాజీ సర్పంచ్ రాజు నాయక్ లు శుక్రవారం మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. అప్పయ్య మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, సర్పంచ్ మేకల రాజయ్య యాదవ్‌తో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంబోజు రవింధర్, ఆర్టీఐ జిల్లా కోకన్వీనర్ చింతల కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
