ఇకపై ‘మీ ప్రమాణం’ యాప్‌లోనే ఉద్యోగుల హాజరు వచ్చే వారం నుంచి తప్పనిసరి.. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి, అక్టోబర్ 5(చక్రవాణి న్యూస్):జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది ఇకపై ‘మీ ప్రమాణం’ యాప్ ద్వారానే హాజరు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ సమావేశపు హాలులో యాప్ వినియోగంపై జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.వచ్చే వారం నుంచి ఈ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవల్లో పారదర్శకత, సమయపాలన, జవాబుదారీతనం పెంచే లక్ష్యంతో ఈ హాజరు విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు ప్రభుత్వ వేతనాలు పొందుతున్న ప్రతి అధికారి, ఉద్యోగి యాప్‌లో హాజరు నమోదు చేయాలని సూచించారు.యాప్ వినియోగం, హాజరు నమోదు విధానంపై ఈడీఎం శ్రీకాంత్ అధికారులకు అవగాహన కల్పించారు. సాంకేతిక సమస్యలు, సందేహాలు ఉంటే ఈడీఎంను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, డీఆర్వో వసంతకుమారి, ఆర్డీఓ హరికృష్ణ, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, ఈడీఎం శ్రీకాంత్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
