మంథని నియోజకవర్గానికి రూ.12.58 కోట్ల నిధులు
గ్రామ పంచాయతీ, అంగన్వాడీ, మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి నిధులు
మంథని, అక్టోబరు 5 (చక్రవాణి డిజిటల్ న్యూస్): మంథని నియోజకవర్గంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన కాటారం, మహాముత్తారం, మహదేవ్పూర్, మల్హర్రావు, పలిమెల మండలాల్లో VB-GRAM-G 2026-27 (MGNREGA) కింద వివిధ అభివృద్ధి పనులకు రూ.12.58 కోట్ల నిధులు మంజూరయ్యాయి.తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చొరవతో ఈ నిధులు మంజూరైనట్లు మంత్రి క్యాంపు కార్యాలయం తెలిపింది.
పలు భవనాల నిర్మాణానికి కేటాయింపులు
నూతన గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, స్వయం సహాయక మహిళా సంఘాల (SHG-VO) భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించారు. ఆయా మండలాల్లో ఇప్పటికే మంజూరైన నిధులతో చేపడుతున్న పనులకు అదనంగా ఈ కేటాయింపులు జరగనున్నాయి.
మంత్రి శ్రీధర్‌బాబుకు కృతజ్ఞతలు
ఐదు మండలాల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, సర్పంచులు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
