మల్లారం సర్పంచ్ రాజయ్య యాదవ్‌కు పితృవియోగం
అనారోగ్యంతో మేకల అప్పయ్య కన్నుమూత
జంగిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతల పరామర్శ
మల్హర్, అక్టోబర్ 22 (చక్రవాణి న్యూస్) : మండలంలోని మల్లారం గ్రామ సర్పంచ్ మేకల రాజయ్య యాదవ్ తండ్రి మేకల అప్పయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు మల్లారం గ్రామానికి చేరుకుని అప్పయ్య పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు మల్హర్రావు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎడ్లపల్లి సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని జంగిడి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు కొండ రాజమ్మ, తాడిచర్ల సర్పంచ్ బండి స్వామి, మండల యూత్ అధ్యక్షుడు, చిన్నతూండ్ల సర్పంచ్ గడ్డం క్రాంతి రణదేవ్, కొండంపేట సర్పంచ్ జ్యోత్స్న సరీన్ రావు, ఇప్పలపల్లి సర్పంచ్ లింగస్వామి, మల్లారం గ్రామ శాఖ అధ్యక్షుడు రాజు నాయక్, కాంగ్రెస్ నాయకులు రమేష్ రెడ్డి, జగన్ నాయక్, గ్రామస్థులు తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
