మల్లారంలో ఇందిరమ్మ ఇంటికి భూమిపూజ
పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు
మల్హర్ , అక్టోబర్ 16 (చక్రవాణి న్యూస్):ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు మల్లారం గ్రామంలో జెట్ల పద్మ–భూమయ్య దంపతుల ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శనివారం భూమిపూజ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ మేకల రాజయ్య కొబ్బరికాయ కొట్టి ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు అవిర్నేని రూపేష్రావు, లింగన్నపేట శ్రీధర్, ముంజం శంకర్, వార్డు సభ్యులు కవిత వెంకటేష్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు భూక్య రాజునాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి లింగన్నపేట మురళి, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు రేవెల్లి లింగయ్య, మాజీ కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు లింగన్నపేట రమేష్, గ్రామ కమిటీ సీనియర్ నాయకుడు ముక్కెనవేన ఐలయ్య, యువజన సభ్యుడు హాట్కర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

