తేదీ: --/--/----రోజు: --సమయం: --:--:--
BREAKING NEWS
తెలంగాణ తాజా వార్తలు • ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు • దేశవ్యాప్తంగా తాజా వార్తలు • మీ చక్రవాణి న్యూస్ • అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

నీటి సంరక్షణ అందరి బాధ్యత!

 ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగించాలి.. ఎంపీడీఓ క్రాంతి కుమార్

లోటు వర్షపాతంతో వేసవిలో నీటి ఎద్దడి ముప్పు


మల్హర్‌, అక్టోబర్23 (చక్రవాణి న్యూస్) : మండలంలో ఈ ఏడాది లోటు వర్షపాతం నమోదైన నేపథ్యంలో రాబోయే వేసవిలో తాగునీరు, సాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఎంపీడీఓ క్రాంతి కుమార్ తెలిపారు. ఈ సమయానికి నిండాల్సిన చెరువులు ఇప్పటికీ నిండకపోవడంతో పాటు, ఒక్క చెరువు కూడా మత్తడి దూకని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఇప్పటి నుంచే నీటిని పొదుపుగా వినియోగిస్తూ, నీటి వనరుల సంరక్షణకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

తాగునీటిని వృథా చేయొద్దు

ప్రజలు తాగునీటిని అవసరమైన మేరకే వినియోగించాలని క్రాంతి కుమార్ సూచించారు. కుళాయిలను అవసరం లేనప్పుడు తెరిచి ఉంచకూడదని, నీటి ట్యాంకులు పొంగి నీరు వృథా కాకుండా చూసుకోవాలని కోరారు. ఇళ్లు, వాహనాల శుభ్రతకు తాగునీటిని అధికంగా వినియోగించకుండా ప్రత్యామ్నాయ పద్ధతులు పాటించాలని తెలిపారు.

సాగునీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించాలి

రైతులు పంటలకు అవసరమైన మేరకే నీటిని వినియోగించాలని, పొలాలకు నీరు పెట్టే సమయంలో కాలువల ద్వారా నీరు వృథాగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సాధ్యమైన చోట బిందు సేద్యం, తుంపర సేద్యం వంటి నీటి పొదుపు పద్ధతులను అనుసరించాలని, వ్యవసాయ శాఖ అధికారుల సలహా మేరకు అందుబాటులో ఉన్న నీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని కోరారు.నీటి సంరక్షణలో భాగంగా ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత నిర్మించుకోవాలని ఎంపీడీఓ సూచించారు. గృహ వినియోగం ద్వారా వెలువడే నీటిని తగిన వడపోత ఏర్పాట్లతో ఇంకుడు గుంతలోకి మళ్లించడం ద్వారా భూగర్భ జలాల పెంపునకు దోహదపడవచ్చని తెలిపారు. ఇంకుడు గుంతలను పరిశుభ్రంగా ఉంచుతూ వాటి నిర్వహణపై కూడా శ్రద్ధ వహించాలని కోరారు.

నీటి వనరులను కాపాడుకోవాలి

చెరువులు, కుంటలు, బావులు, ఇతర నీటి వనరులను కలుషితం చేయకూడదని క్రాంతి కుమార్ సూచించారు. నీటి పైపుల లీకేజీలు, పగుళ్లు కనిపిస్తే వెంటనే సంబంధిత గ్రామ పంచాయతీ అధికారులకు తెలియజేయాలని కోరారు. వర్షపు నీరు వృథాగా వెళ్లిపోకుండా ఇళ్లలో, వ్యవసాయ భూముల్లో సాధ్యమైన మేరకు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు.గ్రామ పంచాయతీలు, ప్రజాప్రతినిధులు నీటి పొదుపు, ఇంకుడు గుంతల నిర్మాణం, బోర్‌వెల్‌ రీచార్జ్‌ నిర్మాణాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి కుటుంబం నీటి వినియోగాన్ని నియంత్రించుకోవడంతో పాటు, నీటి వృథాను గమనించినప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.రాబోయే వేసవిలో తాగునీరు, సాగునీటి అవసరాలను తీర్చుకోవాలంటే ప్రతి నీటి చుక్కను విలువైనదిగా భావించి పొదుపుగా వినియోగించడం అవసరమని ఎంపీడీఓ క్రాంతి కుమార్ పేర్కొన్నారు. ఇప్పటి నుంచే నీటి వనరులను సంరక్షించుకుంటే వేసవిలో మనుషులతో పాటు పశువులు, ఇతర జీవరాశులకు కూడా నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవచ్చన్నారు.నీటి పొదుపును ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని, ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత నిర్మించుకొని నీటి సంరక్షణకు తోడ్పడాలని మల్హర్‌రావు మండల ప్రజలకు ఎంపీడీఓ క్రాంతి కుమార్ విజ్ఞప్తి చేశారు.

Name

MENU MENU

chakravani news chakravani news

SEARCH
Powered by Blogger.

Search This Blog

Life & style

Games

POLITICS$type=left$va=0$count=3

ARCHITECT$type=one$count=3


Gallery

Full width home advertisement

Author Description

Hey there! We are చక్రవాణి న్యూస్ — అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

/gi-fire/ YEAR POPULAR$type=one

Post Page Advertisement [Top]

Comments

Recent

Bottom Ad [Post Page]

Tags

Labels

Travel the world

Advertisement

Climb the mountains