పంచాయతీల అభివృద్ధిపై సమీక్ష
30న తాడిచర్లలో సర్వసభ్య సమావేశం
ఎంపీడీఓ క్రాంతి కుమార్
మల్హర్, అక్టోబర్ 24 (చక్రవాణి న్యూస్): మల్హర్ రావు మండలంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించేందుకు ఈ నెల 30న ఉదయం 11 గంటలకు మండల కేంద్రమైన తాడిచర్ల మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ క్రాంతి కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి అన్ని శాఖల మండలస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరుకావాలని సూచించారు.
