తేదీ: --/--/----రోజు: --సమయం: --:--:--
BREAKING NEWS
తెలంగాణ తాజా వార్తలు • ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు • దేశవ్యాప్తంగా తాజా వార్తలు • మీ చక్రవాణి న్యూస్ • అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

సమాఖ్య నిర్వహణపై సమగ్ర విచారణ జరపాలి

 

జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల మహేందర్‌

సీసీ, సీఏల పనితీరు నుంచి ఖాతాల వరకు ఆడిట్‌ చేయాలని డిమాండ్‌

మల్హర్‌, అక్టోబర్ 24(చక్రవాణి న్యూస్‌): జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మల్హర్‌ మండల సమాఖ్య నిర్వహణ, ఆర్థిక లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపి పూర్తిస్థాయి ఆడిట్‌ నిర్వహించాలని జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల మహేందర్‌ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాల అభ్యున్నతి కోసం పనిచేసే సమాఖ్యలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని, లావాదేవీలు, సిబ్బంది పనితీరుపై స్పష్టత తీసుకురావాలని కోరారు.మండల సమాఖ్యలో పనిచేస్తున్న సీసీ, సీఏల విధులు, పనితీరుతో పాటు ఖాతాల నిర్వహణ, ఆర్థిక లావాదేవీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. సమాఖ్య కార్యకలాపాల్లో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు.తాడిచర్ల గ్రామ జీవనజ్యోతి వీవో (VO) ఎంపిక ప్రక్రియపై కూడా ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గతంలో రద్దయిన అభ్యర్థినే తిరిగి ఎంపిక చేసేందుకు గ్రూపు సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ప్రక్రియ చేపట్టారన్న ఆరోపణలపై అధికారులు స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఎంపిక ప్రక్రియ నిబంధనల ప్రకారం జరిగిందా లేదా అన్నది విచారణ ద్వారా తేల్చాలని పేర్కొన్నారు.ఈ అంశాలపై గతంలో పత్రికల్లో కథనాలు వచ్చినప్పటికీ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని మహేందర్‌ విమర్శించారు. మండల సమైఖ్యలో అనేక ఆరోపణలు వస్తున్న ఉన్నతాధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌, డీఆర్‌డీఓ, సెర్ప్‌ ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని మల్హర్‌ మండల సమాఖ్యపై సమగ్ర ఆడిట్‌ నిర్వహించాలని కోరారు. విచారణలో ఆరోపణలు నిర్ధారణ అయితే బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని వేల్పుల మహేందర్‌ డిమాండ్‌ చేశారు.

Name

MENU MENU

chakravani news chakravani news

SEARCH
Powered by Blogger.

Search This Blog

Life & style

Games

POLITICS$type=left$va=0$count=3

ARCHITECT$type=one$count=3


Gallery

Full width home advertisement

Author Description

Hey there! We are చక్రవాణి న్యూస్ — అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

/gi-fire/ YEAR POPULAR$type=one

Post Page Advertisement [Top]

Comments

Recent

Bottom Ad [Post Page]

Tags

Labels

Travel the world

Advertisement

Climb the mountains