మల్హర్ మండలానికి రూ.2.82 కోట్ల నిధులు
పంచాయతీ, అంగన్వాడీ, మహిళా సంఘాల భవనాలకు భారీగా కేటాయింపులు.. మంత్రి శ్రీధర్‌బాబుకు కాంగ్రెస్ నాయకుల కృతజ్ఞతలు
మల్హర్, అక్టోబర్ 5 (చక్రవాణి న్యూస్): మంథని నియోజకవర్గంలోని మల్హర్రావు మండల అభివృద్ధికి రూ.2.82 కోట్ల నిధులు మంజూరయ్యాయి. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చొరవతో గ్రామ పంచాయతీ, అంగన్వాడీ, స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూప్ భవనాల నిర్మాణానికి ఈ నిధులు కేటాయించినట్లు మంత్రి క్యాంప్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
పంచాయతీ భవనాలకు రూ.60 లక్షలు:
ఇప్పలపల్లి, ఎడ్లపల్లి, నాచారం గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ.60 లక్షలు మంజూరయ్యాయి.
అంగన్వాడీ భవనాలకు రూ.72 లక్షలు:
తాడిచెర్లలోని సెంటర్-1, 4, 5, 6, పీవీ నగర్–వల్లెంకుంట సెంటర్-2, ఎడ్లపల్లి సెంటర్-1 అంగన్వాడీ భవనాల నిర్మాణానికి రూ.12 లక్షల చొప్పున మొత్తం రూ.72 లక్షలు కేటాయించారు.
మహిళా సంఘాల భవనాలకు రూ.1.50 కోట్లు:
చిన్నతూండ్ల, అడ్వాలపల్లి, మల్లారం, తాడిచెర్ల, రుద్రారం, మల్లంపల్లి, దుబ్బపేట, అన్సాన్పల్లి, నాచారం, ఎడ్లపల్లి, కొండంపేట, ఇప్పలపల్లి, వల్లెంకుంట, కొయ్యూర్, పెద్దతూండ్ల గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూప్ భవనాల నిర్మాణానికి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.1.50 కోట్లు మంజూరయ్యాయి.ఈ మూడు విభాగాలకు కలిపి మల్హర్రావు మండలానికి తాజా మంజూరైన నిధులు రూ.2.82 కోట్లు. నిధులు మంజూరు చేయించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు కొండ రాజమ్మ, మాజీ ఎంపీపీ మల్హర్రావు, మాజీ మండల అధ్యక్షుడు బడితల రాజయ్య, కాంగ్రెస్కృ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఐత రాజిరెడ్డి, కృతజ్ఞతలు తెలిపారు.
