తేదీ: --/--/----రోజు: --సమయం: --:--:--
BREAKING NEWS
తెలంగాణ తాజా వార్తలు • ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు • దేశవ్యాప్తంగా తాజా వార్తలు • మీ చక్రవాణి న్యూస్ • అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

రెండేళ్లలో నర్సంపేటలో గులాబీ జెండా ఎగరడం ఖాయం: కేటీఆర్

 

నర్సంపేటను దత్తత తీసుకొని అభివృద్ధి బాధ్యతను దగ్గరుండి చూస్తా

పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది

తెలంగాణ భవన్‌లో నర్సంపేట నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ భరోసా


చక్రవాణి న్యూస్‌ ప్రత్యేక ప్రతినిధి:

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన నర్సంపేట నియోజకవర్గ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. రానున్న రెండేళ్లలో నర్సంపేటలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సంపేట నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని, పెద్ది సుదర్శన్ రెడ్డి చేయాలనుకున్న అభివృద్ధిని దగ్గరుండి పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు.

కార్యకర్తలకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది

పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పార్టీ కాపాడుకుంటుందని, నర్సంపేటలోని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. పార్టీ శ్రేణులన్నీ ఐక్యంగా పోరాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకుడు మరణించినప్పుడు ఆయన కుటుంబానికి అండగా నిలిచి, వారిని గుండెల్లో పెట్టుకొని చూసుకునే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు.

కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయం

ఎక్కడికి వెళ్లినా కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, అమలైన సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలి

ప్రస్తుతం జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. నర్సంపేటలో పార్టీని బలోపేతం చేస్తూ, ఐక్యంగా పనిచేసి రానున్న ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని సూచించారు.


Name

MENU MENU

chakravani news chakravani news

SEARCH
Powered by Blogger.

Search This Blog

Life & style

Games

POLITICS$type=left$va=0$count=3

ARCHITECT$type=one$count=3


Gallery

Full width home advertisement

Author Description

Hey there! We are చక్రవాణి న్యూస్ — అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

/gi-fire/ YEAR POPULAR$type=one

Post Page Advertisement [Top]

Comments

Recent

Bottom Ad [Post Page]

Tags

Labels

Travel the world

Advertisement

Climb the mountains