భర్త ఇంటి ఎదుట చిన్నారితో భార్య నిరసన!
ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఇంట్లోకి రానివ్వడం లేదని ఆరోపణ
న్యాయం చేయాలని గేటు ముందు బైఠాయింపు
కోరుట్ల, అక్టోబర్ 28(చక్రవాణి న్యూస్): జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్లో భర్త ఇంటి ఎదుట భార్య అరుణ తన చిన్నారి కూతురితో కలిసి బైఠాయించి నిరసన తెలిపింది. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి భర్త గణేష్, అత్తమామలు తనను ఇంట్లోకి రానివ్వడం లేదని అరుణ ఆవేదన వ్యక్తం చేసింది. తాను వస్తున్న విషయం తెలుసుకుని ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ చిన్నారితో కలిసి ఇంటి గేటు ముందు నిరసనకు దిగింది.
