పండుగ షాపింగ్‌లో చేదు అనుభవం
చిన్నారి మెడలోని బంగారు బిళ్ల మాయం
తాడు కోసిన ఆనవాళ్లు.. పోలీసులకు ఫిర్యాదు
భూపాలపల్లి, అక్టోబర్ 13 (చక్రవాణి న్యూస్) : పండుగ సందర్భంగా షాపింగ్‌కు వెళ్లిన ఓ కుటుంబానికి ఊహించని ఘటన ఎదురైంది. భూపాలపల్లిలోని కాసం షాపింగ్ మాల్లో బాలాజీ కుటుంబానికి చెందిన చిన్నారి మెడలోని సుమారు రూ.50 వేల విలువైన బంగారు బిళ్ల కనిపించకుండా పోయింది. చిన్నారి మెడలోని తాడు కోసినట్లుగా ఉండటంతో పాటు గాయం కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గుర్తుతెలియని వ్యక్తులే బంగారాన్ని అపహరించి ఉంటారని అనుమానిస్తూ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి ఘటనపై విచారణ చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.
