కలప అక్రమ రవాణాపై కఠిన చర్యలు! అనుమతులు లేకుండా తరలిస్తే వాహనాలు సీజ్
మల్హర్, అక్టోబర్ 9 (చక్రవాణి న్యూస్):
మండల కేంద్రమైన తాడిచెర్ల బ్లాక్-2 గని ప్రారంభం కానున్న నేపథ్యంలో పాత ఇళ్లను కొనుగోలు చేసి, వాటిలోని కలపను ఇళ్ల నిర్మాణాలకు వినియోగిస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తాడిచెర్ల లోని శాత్రాజ్ పల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పాత ఇళ్ల కలప కొనుగోలు, రవాణా సమయంలో నిబంధనలు పాటించాలని ఫారెస్ట్ సెక్షన్ అధికారి వినోద్ సూచించారు. అవసరమైన అనుమతులు లేకుండా కలపను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీట్ ఆఫీసర్లు మహేందర్, సతీష్, గ్రామస్తులు పాల్గొన్నారు.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
