జాకారం సర్పంచ్‌పై సస్పెన్షన్ వేటు?
నిబంధనలకు విరుద్ధంగా కార్మికుడిని పొలానికి తీసుకెళ్లారన్న ఆరోపణలు... డీపీవో విచారణ నివేదిక కలెక్టర్‌కు
ములుగు, అక్టోబర్ 7(చక్రవాణి న్యూస్) : ములుగు జిల్లా జాకారం గ్రామ సర్పంచ్ దాసరి సమతపై సస్పెన్షన్ వేటు పడనున్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా గ్రామపంచాయతీ కార్మికుడు రామస్వామిని తన పొలంలో పనికి తీసుకెళ్లగా, ఆయన పాము కాటుకు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి.సర్పంచ్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ అందిన ఫిర్యాదులపై జిల్లా పంచాయతీ అధికారి విచారణ చేపట్టినట్లు తెలిసింది. విచారణ అనంతరం రూపొందించిన నివేదికను కలెక్టర్‌కు సమర్పించినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనల ప్రకారం సర్పంచ్‌పై ఆరు నెలలపాటు సస్పెన్షన్ విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాతే సస్పెన్షన్‌పై స్పష్టత రానుంది.
