మేకల అప్పయ్య మృతదేహానికి మాజీ ఎంపీపీ మలహల్ రావు నివాళులు
మల్లారం సర్పంచ్ రాజయ్య యాదవ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీపీ
, తాడిచర్ల సర్పంచ్ బండి స్వామి
మల్హర్, అక్టోబర్ 22(చక్రవాణి న్యూస్) : మండలంలోని మల్లారం గ్రామ సర్పంచ్ మేకల రాజయ్య యాదవ్ తండ్రి మేకల అప్పయ్య అనారోగ్యంతో మృతి చెందాగ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు, తాడిచర్ల సర్పంచ్ బండి స్వామి మల్లారం గ్రామానికి చేరుకుని అప్పయ్య పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం సర్పంచ్ మేకల రాజయ్య యాదవ్‌ను, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి ఆంతిమ యాత్రలో పాల్గొని పాడే మోసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తాడిచర్ల సర్పంచ్ బండి స్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
