ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సమగ్ర ప్రణాళిక
ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి
రెండు రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి: కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి , అక్టోబర్ 13(చక్రవాణి న్యూస్) :
ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ రంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత సీజన్‌తో పోలిస్తే ప్రస్తుత సీజన్‌లో తక్కువ వర్షపాతం నమోదైందని, ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు, చెరువులు, ఇతర నీటి వనరులపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. రైతులు వరి సాగుపైనే ఆధారపడకుండా కంది, మొక్కజొన్న, పెసలు, మినుములు, శనగ, వేరుశనగ, సోయాబీన్, జొన్న, సజ్జ వంటి తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు మళ్లేలా అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రత్యామ్నాయ పంటల సాగు ద్వారా కలిగే ఆర్థిక ప్రయోజనాలు, మార్కెట్ అవకాశాలు, మద్దతు ధరలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలపై రైతులకు వివరించాలన్నారు. అవసరమైన విత్తనాల లభ్యతపై దృష్టి సారించి, మండలాలు, గ్రామాల వారీగా రైతుల డిమాండ్‌ను సేకరించి సబ్సిడీ వివరాలతో ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు.
వ్యవసాయ శాఖ నోడల్ శాఖగా వ్యవహరిస్తూ వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, నీటిపారుదల తదితర శాఖలతో సమన్వయం చేసుకుని రెండు రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసే పంటలు, మద్దతు ధరలు, కొనుగోలు విధానంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
వేసవిలో మంచినీటి సమస్యలు తలెత్తకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్లు రూపొందించాలని, రబీ సాగుకు ముందుగానే తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ద్వారా ప్రత్యామ్నాయ పంటల సాగుపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ సౌరవ్ శర్మ, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ హరికృష్ణతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:
