ఎల్‌నినో ప్రభావాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి
రవీంద్రభారతిలో రాష్ట్రస్థాయి అవగాహన సదస్సు
భూపాలపల్లి జిల్లా నుంచి పాల్గొన్న డీపీఆర్వో శీలం శ్రీనివాస్, సాంస్కృతిక సారథి కళాకారులు
హైదరాబాద్, అక్టోబర్ 23(చక్రవాణి న్యూస్) : ఎల్‌నినో ప్రభావాలతో భవిష్యత్తులో తలెత్తే వాతావరణ మార్పులు, వర్షపాత లోటు, ఉష్ణోగ్రతల పెరుగుదలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. సమాచార పౌర సంబంధాల శాఖ, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సదస్సుకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి డీపీఆర్వో శీలం శ్రీనివాస్‌తో పాటు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఎల్‌నినో ప్రభావాలను ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన అవసరాన్ని అధికారులు వివరించారు.కళాజాతాలు, పాటలు, నాటికలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. నీటి సంరక్షణ, విద్యుత్ పొదుపు, ప్రత్యామ్నాయ పంటల సాగు, తాగునీటి వినియోగంలో జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.ఎల్‌నినో ప్రభావాలతో విద్యుత్, మిషన్ భగీరథ, వ్యవసాయ, పశుసంవర్ధక రంగాల్లో ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నీరు, విద్యుత్ పొదుపును ప్రజలు దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని, కళాకారుల ద్వారా గ్రామగ్రామాన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుంద రెడ్డి, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ డాక్టర్ జి. వెన్నెల, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు రవీందర్ రెడ్డి, వివిధ జిల్లాల డీపీఆర్వోలు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
