అడవిని.. వన్యప్రాణులను కాపాడుకుందాం
ఎడ్లపల్లి మోడల్ పాఠశాలలో వన్యప్రాణి వారోత్సవాల నిర్వహణ
మల్హర్, అక్టోబర్ 4 (చక్రవాణి న్యూస్): మండలంలోని ఎడ్లపల్లి మోడల్ పాఠశాలలో వన్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకుని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు వన్యప్రాణుల ప్రాధాన్యత, పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్ర, సంరక్షణ ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు.వన్యప్రాణుల మనుగడకు అడవులను కాపాడాల్సిన అవసరం ఉందని, వాటిని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు సూచించారు. వన్యప్రాణుల పట్ల విద్యార్థులు అవగాహన పెంచుకుని, వాటి సంరక్షణకు తమ వంతు సహకారం అందించాలని కోరారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్. పూర్ణచందర్రావు, అటవీశాఖ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
