ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో అల్పాహార పథకం ప్రారంభం
ఎడ్లపల్లి సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో
మల్హర్, అక్టోబర్ 5 (చక్రవాణి న్యూస్) :మండలంలోని ఎడ్లపల్లి తెలంగాణ మోడల్ స్కూల్లో సోమవారం విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎడ్లపల్లి గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో ముఖ్యమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అల్పాహారాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో ఉపసర్పంచ్ వేల్పుల రమేష్, వార్డు సభ్యులు, ఎంఈఓ లక్ష్మణ్ బాబు, పాఠశాల ప్రిన్సిపాల్ సీహెచ్ పూర్ణచందర్ రావు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
