దండు రమేష్‌పై విమర్శలు మానుకోవాలి
తాడిచర్ల డేంజర్ జోన్ సమస్య పరిష్కారానికి శ్రీధర్‌బాబు కృషి
రుద్రారం సర్పంచ్ చంద్రగిరి సంపత్
మల్హర్, అక్టోబర్ 19 (చక్రవాణి న్యూస్): కాంగ్రెస్ నాయకుడు, ఈజీసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు రమేష్‌పై బిఆర్ఎస్ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని రుద్రారం సర్పంచ్ చంద్రగిరి సంపత్ అన్నారు. సోమవారం రుద్రారం గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దళితులు, పేద ప్రజల సమస్యలపై రమేష్ నిరంతరం పోరాడుతున్నారని పేర్కొన్నారు.తాడిచర్ల డేంజర్ జోన్ నిర్వాసితులకు న్యాయం చేయాలని దండు రమేష్ అనేక ఉద్యమాలు చేపట్టారని తెలిపారు. మంత్రి శ్రీధర్‌బాబు చొరవతో నిర్వాసితుల సమస్య పరిష్కారానికి చర్యలు కొనసాగుతున్నాయని, ఈ ప్రక్రియలో భాగంగా రూ.261 కోట్లు కలెక్టర్ ఖాతాలో జమ చేసినట్లు పేర్కొన్నారు. సంబంధిత ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.దండు రమేష్‌పై ఆరోపణలు చేసేవారు ఆధారాలతో నిరూపించాలని సంపత్ సవాల్ విసిరారు. ఈ సమావేశంలో వార్డు సభ్యుడు గాదె గట్టయ్య, మోత్కూర్ మహేష్, కొమ్మర స్వామి, కొమ్మేర రమేష్, అజ్మిరా స్వామి తదితరులు పాల్గొన్నారు.
