కాంగ్రెస్ను నమ్మి ఓట్లేయిస్తే.. నా పొలం కూడా ఎండిపోతోంది!
- 5 గంటల కరెంటు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన
- రేవంత్ రెడ్డిని నమ్మి మోసపోయామని గోపాల్ నాయక్ వ్యాఖ్యలు
తిమ్మాజిపేట, నాగర్కర్నూల్, చక్రవాణి న్యూస్ : కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేయిస్తే.. ఇప్పుడు తన పొలం కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఆ పార్టీ కార్యకర్త, రైతు గోపాల్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం పుల్లగిరి గ్రామంలో విద్యుత్ కోతల కారణంగా పంట ఎండిపోతోందని వాపోయారు. రేవంత్ రెడ్డిని నమ్మి ఓటేస్తే కనీసం ఐదు గంటల విద్యుత్ కూడా సక్రమంగా సరఫరా చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన గోపాల్ నాయక్.. ప్రస్తుతం విద్యుత్ సమస్యతో తన పొలం ఎండిపోతుండటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
