కార్పొరేట్ వైద్యం కంటే .. ప్రభుత్వ వైద్యమే ముద్దు!
ప్రభుత్వ వైద్య సేవలపై నమ్మకం చాటిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి, చక్రవాణి న్యూస్, అక్టోబర్ 14:ప్రభుత్వ వైద్య సేవలపై నమ్మకం చాటుతూ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదర్శంగా నిలిచారు. వాకింగ్ చేస్తుండగా అనుకోకుండా కాలు జారి ఫ్రాక్చర్ అయినప్పటికీ,
కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలోనే చికిత్స పొందారు.తాజాగా బుధవారం అదే ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు ఎక్స్రే పరీక్షలు నిర్వహించి, కోలుకుంటున్న తీరును పరిశీలించారు.సాధారణ ప్రజల మాదిరిగానే ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలను ఆశ్రయించిన కలెక్టర్ తీరుపై స్థానిక వైద్యులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్య సేవలు, సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.
