చక్రవాణి కథనానికి స్పందన.. భూపాలపల్లి పాఠశాలల్లో అల్పాహారం ప్రారంభం
భూపాలపల్లి, అక్టోబర్ 5 (చక్రవాణి న్యూస్): సెప్టెంబర్ 24న చక్రవాణి న్యూస్‌లో ప్రచురితమైన “భూపాలపల్లి జిల్లాలో అల్పాహారం ప్రారంభమెప్పుడు?” కథనానికి స్పందనగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం లాంఛనంగా అల్పాహారం కార్యక్రమం ప్రారంభమైంది.దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమం ప్రారంభానికి కృషి చేసిన ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అధికారులకు, సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన చక్రవాణి డిజిటల్ న్యూస్‌కు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
