బుద్ధారంలో భర్త హత్య కలకలం
వివాహేతర సంబంధమే కారణం.. భార్య, ప్రియుడు సహా ముగ్గురికి రిమాండ్
భూపాలపల్లి, అక్టోబర్ 1 (చక్రవాణి న్యూస్): అగ్ని సాక్షిగా ఒక్కటైన దాంపత్యంలో వివాహేతర సంబంధం చిచ్చురేపింది. గణపురం మండలం బుద్ధారంలో భర్త పెండెల సంపత్ (32) హత్యకు గురయ్యాడు. భర్తను అడ్డు తొలగించుకునేందుకు భార్య సుమలత (26), ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఉమ్మల శ్రీకాంత్ (36) కలిసి హత్యకు పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు.పథకాన్ని అమలు చేసేందుకు **పోలుదాసరి తరుణ్ (23)**ను సంప్రదించి రూ.లక్షకు ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ నెల 17న శ్రీకాంత్, తరుణ్‌లు సంపత్‌ను మద్యం తాగేందుకు తీసుకెళ్లి పురుగుల మందు కలిపిన మద్యం తాగించడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు పేర్కొన్నారు.మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించారు. సుమలత, శ్రీకాంత్, తరుణ్‌లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు డీఎస్పీ సంపత్‌రావు తెలిపారు.
