కుట్టు శిక్షణ పూర్తి చేసిన 600 మందికి ధ్రువీకరణ పత్రాలు అందజేసిన మంత్రి శ్రీధర్‌బాబు
త్వరలో మంథనిలో గార్మెంట్ కంపెనీ ప్రారంభం
సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రూ.కోటి విలువైన చెక్కుల పంపిణీ
మంథని, అక్టోబర్ 18 (చక్రవాణి న్యూస్) : మంథని నియోజకవర్గ కేంద్రంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఉచిత కుట్టు శిక్షణ పూర్తి చేసిన 600 మందికి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. అలీఫ్, డీఆర్డీఏ, మెప్మా, సీఎస్ఆర్ ద్వారా నిర్వహించిన ఈ శిక్షణను నియోజకవర్గవ్యాప్తంగా ఇప్పటివరకు 3,040 మంది విజయవంతంగా పూర్తి చేశారు.శిక్షణ పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు త్వరలోనే గార్మెంట్ కంపెనీని ప్రారంభించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అలాగే సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రూ.కోటి విలువైన చెక్కులను అందజేశారు.

