అంబర్పేట్లో 72 అడుగుల భారీ బతుకమ్మ! ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
హైదరాబాద్ అక్టోబర్ 17(చక్రవాణి న్యూస్): హైదరాబాద్లోని అంబర్పేట్ గ్రౌండ్లో నిర్వహించనున్న బతుకమ్మ ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన 72 అడుగుల భారీ బతుకమ్మను కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి సందర్శించారు. ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించి, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వైభవాన్ని చాటేలా భారీ ఏర్పాట్లు చేపట్టారు. బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
