తేదీ: --/--/----రోజు: --సమయం: --:--:--
BREAKING NEWS
తెలంగాణ తాజా వార్తలు • ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు • దేశవ్యాప్తంగా తాజా వార్తలు • మీ చక్రవాణి న్యూస్ • అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

ఉద్యోగ మేళాకు నిరుద్యోగ యువత తరలిరావాలి..... భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ


300కు పైగా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు.. అక్టోబర్ 9న పుష్ప గ్రాండ్‌లో మేళా

భూపాలపల్లి, అక్టోబర్ 6 (చక్రవాణి న్యూస్): జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అక్టోబర్ 9న భూపాలపల్లిలోని పుష్ప గ్రాండ్ ప్రాంగణంలో భారీ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. 300కు పైగా కంపెనీలు పాల్గొని ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నందున అర్హత కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే యువత కోసం ఆర్టీఓ ఆధ్వర్యంలో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. గ్రామాలు, మండలాల వారీగా నిరుద్యోగ యువతను గుర్తించి మేళాకు తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.పుష్ప గ్రాండ్, బీఐటీఎస్‌ స్కూల్స్‌ వద్ద రిజిస్ట్రేషన్‌ కౌంటర్లు, ఇంటర్వ్యూ హాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. యువతకు నీడ, మంచినీరు, పారిశుధ్య సౌకర్యాలు కల్పించడంతో పాటు రద్దీ నియంత్రణ, పార్కింగ్‌, పోలీసు భద్రత, నిరంతర విద్యుత్‌ సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.అర్హత కలిగిన నిరుద్యోగ యువత తమ విద్యార్హతల ధ్రువపత్రాలు, అవసరమైన సర్టిఫికెట్లతో అక్టోబర్‌ 9న సమయానికి హాజరై ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు. 

మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
Name

MENU MENU

chakravani news chakravani news

SEARCH
Powered by Blogger.

Search This Blog

Life & style

Games

POLITICS$type=left$va=0$count=3

ARCHITECT$type=one$count=3


Gallery

Full width home advertisement

Author Description

Hey there! We are చక్రవాణి న్యూస్ — అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

/gi-fire/ YEAR POPULAR$type=one

Post Page Advertisement [Top]

Comments

Recent

Bottom Ad [Post Page]

Tags

Labels

Travel the world

Advertisement

Climb the mountains