తేదీ: --/--/----రోజు: --సమయం: --:--:--
BREAKING NEWS
తెలంగాణ తాజా వార్తలు • ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు • దేశవ్యాప్తంగా తాజా వార్తలు • మీ చక్రవాణి న్యూస్ • అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

పారామెడికల్ కోర్సులకు అప్లికేషన్లు ప్రారంభం!

భూపాలపల్లి ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రవేశాలు

డీఎంఎల్‌టీ, డీఈసీజీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం


జయశంకర్ భూపాలపల్లి, చక్రవాణి న్యూస్‌: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి పారామెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పారామెడికల్ బోర్డు (టీజీపీఎంబీ) నోటిఫికేషన్‌ ప్రకారం డీఎంఎల్‌టీ (DMLT), డీఈసీజీ (DECG) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 24వ తేదీలోగా భూపాలపల్లి ప్రభుత్వ వైద్య కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. దరఖాస్తుతో పాటు విద్యార్హతల ధ్రువపత్రాలు, స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను జతచేయాలని తెలిపారు. ఆయా పత్రాలపై అభ్యర్థులు స్వయంగా సంతకాలు చేసి (సెల్ఫ్ అటెస్టేషన్) సమర్పించాలన్నారు.అసంపూర్తిగా ఉన్న లేదా తప్పుడు సమాచారం అందించిన దరఖాస్తులను తిరస్కరిస్తామని స్పష్టం చేశారు. దరఖాస్తు ఫారాలు, ఇతర పూర్తి వివరాల కోసం తెలంగాణ రాష్ట్ర పారామెడికల్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ https://tgpmb.telangana.gov.in ను సందర్శించాలని ప్రిన్సిపాల్ సూచించారు.

Name

MENU MENU

chakravani news chakravani news

SEARCH
Powered by Blogger.

Search This Blog

Life & style

Games

POLITICS$type=left$va=0$count=3

ARCHITECT$type=one$count=3


Gallery

Full width home advertisement

Author Description

Hey there! We are చక్రవాణి న్యూస్ — అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

/gi-fire/ YEAR POPULAR$type=one

Post Page Advertisement [Top]

Comments

Recent

Bottom Ad [Post Page]

Tags

Labels

Travel the world

Advertisement

Climb the mountains