తేదీ: --/--/----రోజు: --సమయం: --:--:--
BREAKING NEWS
తెలంగాణ తాజా వార్తలు • ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు • దేశవ్యాప్తంగా తాజా వార్తలు • మీ చక్రవాణి న్యూస్ • అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

భూపాలపల్లిలో కల్తీ మటన్ అమ్మకాలు..?

 


రోగాల బారిన పడిన గొర్రెలు, మేకల మాంసం విక్రయిస్తున్నారంటూ ఫిర్యాదులు

మున్సిపల్, వెటర్నరీ అధికారుల తనిఖీలు ఎక్కడ? అని స్థానికుల ప్రశ్న

నాణ్యమైన మాంసం విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్

భూపాలపల్లి, అక్టోబర్ 4 (చక్రవాణి న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మాంసం విక్రయాలపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనారోగ్యంతో ఉన్న గొర్రెలు, మేకలను తీసుకొచ్చి కోసి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. కొందరు వ్యాపారులు ఇలాంటి మాంసాన్ని హోటళ్లకు కూడా సరఫరా చేస్తున్నట్లు సమాచారం.నిబంధనల ప్రకారం మాంసం విక్రయించే ముందు సంబంధిత అధికారులు జంతువుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, వినియోగానికి అనుకూలమైన మాంసాన్ని మాత్రమే విక్రయించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పట్టణంలోని కొన్ని మాంసం దుకాణాల్లో ఈ నిబంధనలు సక్రమంగా అమలవుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.నడవలేని స్థితిలో ఉన్న గొర్రెలు, మేకలను వాహనాలపై తీసుకొచ్చి కోసి విక్రయిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మాంసం ప్రియులు నమ్మకంతో దుకాణాల్లో మటన్ కొనుగోలు చేస్తున్నప్పటికీ, నాణ్యతపై అనుమానాలు ఉంటే ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.భూపాలపల్లి మున్సిపల్ అధికారులు, వెటర్నరీ అధికారులు పట్టణంలోని మాంసం దుకాణాలను తనిఖీ చేసి, జంతువుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన అనంతరం మాత్రమే మాంసం విక్రయించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించే దుకాణాలపై తగిన చర్యలు తీసుకుని ప్రజలకు సురక్షితమైన మాంసం అందేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.

మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
Name

MENU MENU

chakravani news chakravani news

SEARCH
Powered by Blogger.

Search This Blog

Life & style

Games

POLITICS$type=left$va=0$count=3

ARCHITECT$type=one$count=3


Gallery

Full width home advertisement

Author Description

Hey there! We are చక్రవాణి న్యూస్ — అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

/gi-fire/ YEAR POPULAR$type=one

Post Page Advertisement [Top]

Comments

Recent

Bottom Ad [Post Page]

Tags

Labels

Travel the world

Advertisement

Climb the mountains