బతుకమ్మ వేడుకలు సురక్షితంగా జరుపుకోవాలి.. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన భూపాలపల్లి కలెక్టర్
చక్రవాణి న్యూస్ | అక్టోబర్ 10 (చక్రవాణి న్యూస్) :
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను జిల్లా ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఆకాంక్షించారు. ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా శనివారం జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.బతుకమ్మ పండుగ మహిళల ఆత్మీయతకు, ఐక్యతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీక అని పేర్కొన్నారు. తొమ్మిది రోజుల వేడుకలు ప్రతి ఇంటా సంతోషాన్ని నింపాలని ఆకాంక్షించారు.బతుకమ్మ నిమజ్జనం సమయంలో గోదావరి, చెరువులు, కుంటలు, వాగుల వద్ద జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నీటిలోకి లోతుగా వెళ్లకూడదని, చిన్నపిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. నిమజ్జన ప్రాంతాల్లో మున్సిపల్, పంచాయతీ అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. పండుగను సంప్రదాయబద్ధంగా, సురక్షితంగా జరుపుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
