పుట్ట మధు వ్యాఖ్యలపై సర్పంచ్ బండి స్వామి ఆగ్రహం!
మంత్రి శ్రీధర్‌బాబుపై అనుచిత వ్యాఖ్యలు తగవు
బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతా
మల్హర్, అక్టోబర్ 16 (చక్రవాణి న్యూస్): శాత్రాజ్‌పల్లిలో పేదల ఇళ్ల కూల్చివేత ఘటనపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు చేసిన వ్యాఖ్యలను సర్పంచ్ బండి స్వామి తప్పుబట్టారు. శుక్రవారం తాడిచర్లలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జంగిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి శ్రీధర్‌బాబుపై పుట్ట మధు ఏకవచనంతో, అనుచితంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు.
ఇళ్ల కూల్చివేత సమయంలో తాను మంత్రి శ్రీధర్‌బాబుకు ఫోన్ చేయగా, ఆయన స్పందించి బాధితులతో కలిసి కలెక్టర్‌ను కలవాలని సూచించారని బండి స్వామి తెలిపారు. మంత్రి సూచన మేరకు బాధితులతో కలిసి కలెక్టరేట్‌కు వెళ్లి వినతిపత్రం అందజేశామని పేర్కొన్నారు.అర్ధరాత్రి ఇళ్ల కూల్చివేతను అడ్డుకునేందుకు తాను అధికారులను వేడుకున్నానని, ఘటనకు సంబంధించిన వీడియోలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. తాను మొసలి కన్నీరు కారుస్తున్నానంటూ పుట్ట మధు వ్యాఖ్యానించడం సరికాదన్నారు. వ్యక్తిగత విమర్శలు మాని, ప్రజల సమస్యలపై రాజకీయంగా పోరాడాలని సూచించారు.శాత్రాజ్‌పల్లి తన పంచాయతీ పరిధిలోని గ్రామమని, బాధితులకు ప్రభుత్వం ద్వారా న్యాయం జరిగే వరకు అండగా ఉండి పోరాడతానని సర్పంచ్ బండి స్వామి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఈజీసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు రమేష్, తాడిచర్ల ఫాక్స్ చైర్మన్ ఇప్ప మొండయ్య, చిన్నతూండ్ల సర్పంచ్ గడ్డం క్రాంతి, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

