ఏపీలో అర్నబ్ తుపాను బీభత్సం.. ఏడుగురు మృతి!
ఈదురుగాలులకు కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
విశాఖ, అనకాపల్లి, ఉభయ గోదావరి జిల్లాల్లో తీవ్ర ప్రభావం
చక్రవాణి డిజిటల్ న్యూస్, ఆంధ్ర ప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో అర్నబ్ తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇళ్లు కూలిన ఘటనల్లో ఏడుగురు మృతి చెందారు.విశాఖపట్నంలోని పాత గోశాల, బాలాజీనగర్లో విద్యుత్ స్తంభాలు కూలి ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. భీమవరంలో చెట్టు కూలి ఒకరు, విద్యుత్ స్తంభం విరిగిపడి మరొకరు మృతి చెందారు. తుపాను సంబంధిత ఘటనల్లో కోనసీమలో ఇద్దరు, అనకాపల్లిలో ఒకరు మరణించినట్లు సమాచారం.
