విద్యార్థులకు రాజ్యాంగంపై అవగాహన కల్పించాలి
రాష్ట్ర సలహాదారు ఎర్రం అలెగ్జాండర్ ప్రభు పిలుపు
జిల్లా అధ్యక్షుడు ఇందారపు ఎల్లయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం
మల్హర్, అక్టోబర్ 17 (చక్రవాణి న్యూస్): తాడిచర్ల హనుమాన్ జంక్షన్లో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు ఇందారపు ఎల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర సలహాదారు ఎర్రం అలెగ్జాండర్ ప్రభు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరో తరగతి నుంచి ఉన్నత విద్య వరకు భారత రాజ్యాంగాన్ని ప్రత్యేక పాఠ్యాంశంగా చేర్చి, విద్యార్థులకు రాజ్యాంగంపై అవగాహన కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20న నాగ్పూర్ దీక్షాభూమిలో నిర్వహించే కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండి స్వామి, ఉపసర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, మండల అధ్యక్షుడు మేరుగు రాజయ్య, ప్రధాన కార్యదర్శి దేవరకొండ రాజయ్య, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
