రూ.12 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ అటవీ శాఖ అధికారి
నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ఏసీబీ దాడులు
ఖానాపూర్, అక్టోబర్ 8(చక్రవాణి న్యూస్) : టింబర్ డిపో పర్మిషన్ కోసం ఓ వ్యక్తి నుంచి రూ.12 వేల లంచం తీసుకుంటున్నారనే ఆరోపణపై నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ సెక్షన్ అధికారి రవీందర్‌ను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం.లంచం మొత్తాన్ని స్వీకరిస్తున్న సమయంలో అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిసింది. ఘటనకు సంబంధించి ఏసీబీ అధికారులు తదుపరి విచారణ చేపట్టారు.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
