ఓటరు వివరాలపై అప్రమత్తంగా ఉండాలి.. సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు కొండ రాజమ్మ
SIR నోటీసులు అందుకున్న వారు ఆధారాలతో స్పందించాలని పిలుపు
మల్హర్, సెప్టెంబర్ 27 (చక్రవాణి న్యూస్): ఓటరు జాబితాలో వివరాలను ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని మల్హర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు, కొయ్యూరు సర్పంచ్ కొండ రాజమ్మ సూచించారు. కొయ్యూరు ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన SIR అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. నోటీసులు అందుకున్న వారు ఆధార్, రేషన్ కార్డు తదితర పత్రాలతో సంబంధిత అధికారులను సంప్రదించి వివరాలను సరిచేసుకోవాలన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం శారద, ఆర్ఐ నరేష్కుమార్, సూపర్వైజర్ స్వర్ణలత, బీఎల్ఓ సరిత, రజిత, బీఎల్ఏ వేల్పుల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
