అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి: కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి, సెప్టెంబర్ 9(చక్రవాణి న్యూస్) :
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR-2026) ప్రక్రియలో క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ గడువును అక్టోబర్ 7, 2026 వరకు పొడిగించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.సవరించిన షెడ్యూల్ ప్రకారం క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిశీలన, పరిష్కార ప్రక్రియ నవంబర్ 5 వరకు కొనసాగుతుందని, తుది ఓటర్ల జాబితాను నవంబర్ 9న ప్రచురించనున్నట్లు వెల్లడించారు.01.10.2026 నాటికి ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హత ఉన్న ప్రతి పౌరుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఓటర్ల జాబితాలో పేర్లు, వివరాలను పరిశీలించుకోవడంతో పాటు అవసరమైన మార్పులు, చేర్పులు, సవరణలకు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
న్యూస్
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే
విష్ణుచక్రం... మీ చక్రవాణి న్యూస్!"

0 Comments