తెలంగాణలో మళ్లీ ఎండల తీవ్రత
నేటి నుంచి 34–35 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (చక్రవాణి న్యూస్) : తెలంగాణలో వారం రోజులుగా కురిసిన వర్షాలకు విరామం లభించనుంది. నేటి నుంచి రాష్ట్రంలో వాతావరణం పొడిగా మారి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగనున్నట్లు వెదర్‌మ్యాన్ బాలాజీ తెలిపారు. పలు ప్రాంతాల్లో 34–35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఉదయం వేళ చల్లని వాతావరణం కొనసాగుతుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 29న దక్షిణ తెలంగాణలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అక్టోబర్ 2 వరకు మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం, ఆ తర్వాత ఆగ్నేయ తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
