ఉద్యమకారులకు తక్షణమే న్యాయం చేయాలి..మలిదశ తెలంగాణ ఉద్యమ కారులు ముడితనపెల్లి ప్రభాకర్
ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేసి అర్హులను గుర్తించాలి
మల్హర్, సెప్టెంబర్ 30 (చక్రవాణి న్యూస్): తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారులకు ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని తెలంగాణ మలిదశ ఉద్యమకారుల ఫోరం నాయకులు ముడితనపెల్లి ప్రభాకర్ కోరారు. ఉద్యమకాలం నాటి పోలీస్ రికార్డులు, ఎఫ్ఐఆర్లు, పత్రికా క్లిప్పింగుల ఆధారంగా అర్హులైన ఉద్యమకారులను గుర్తించి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దరఖాస్తుల కోసం ప్రత్యేక అధికారిక వెబ్సైట్ ఏర్పాటు చేసి డిజిటల్ గుర్తింపు కార్డులు, నెలవారీ గౌరవ పెన్షన్లు, సంక్షేమ బోర్డు, హెల్త్ కార్డులు, బస్, ట్రైన్ పాస్ లు అందించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రత్యేక చొరవ తీసుకుని గుర్తింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
