22ఏ భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయం
GHMC, HMDA, DTCP అనుమతులున్న భూముల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (చక్రవాణి న్యూస్):
తెలంగాణలో 22ఏ భూముల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. GHMC, HMDA, DTCP వంటి చట్టబద్ధమైన ప్లానింగ్ సంస్థల అనుమతులు ఉన్న లేఅవుట్లు 22ఏ జాబితాలో ఉన్నప్పటికీ పెండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఇప్పటివరకు 22ఏ నిషేధిత జాబితాలో ఉండటంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన పలు ఆస్తుల విషయంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా GHMC, HMDA, DTCP అనుమతులు పొందిన లేఅవుట్లకు సంబంధించిన పెండింగ్ రిజిస్ట్రేషన్లను పరిశీలించి పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.22ఏ భూముల సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు ప్రకటించింది. ఈ క్రమంలో పెండింగ్ రిజిస్ట్రేషన్ల పరిష్కారం, లేఅవుట్ల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై దృష్టి సారించింది.ఈ నిర్ణయంతో 22ఏ కారణంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన అర్హత కలిగిన ఆస్తిదారులకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. అయితే సంబంధిత ఆస్తి ఏ కేటగిరీలోకి వస్తుంది, ఏ అనుమతులు ఉన్నాయి అనే అంశాల ఆధారంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ వర్తించనుంది.

