ట్యాంక్‌బండ్ వద్ద ఎస్ఐ మృతి
నిమజ్జనం బందోబస్తులో ఉండగా బైక్ ఢీ.. చికిత్స పొందుతూ మృతి
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (చక్రవాణి న్యూస్):
గణేశ్ నిమజ్జనం బందోబస్తు విధుల్లో ఉన్న ఎస్ఐ కె. వెంకన్నను ట్యాంక్‌బండ్ సమీపంలో గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకన్నకు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు సమాచారం.ప్రమాదానికి కారణమైన వాహనదారుడు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి వాహనదారుడి కోసం గాలిస్తున్నారు.

