తాడిచెర్లలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం
జెండా ఆవిష్కరించిన గ్రామ శాఖ అధ్యక్షుడు కేసారపు చంద్రయ్య
ముఖ్య అతిథిగా హాజరైన ఫాక్స్ చైర్మన్ ఇప్ప మొండయ్య
మల్హర్, సెప్టెంబర్ 17 (చక్రవాణి న్యూస్ ):
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్హర్రావు మండలంలోని తాడిచెర్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ శాఖ అధ్యక్షుడు కేసారపు చంద్రయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.కార్యక్రమంలో తాడిచెర్ల పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, గ్రామ సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు, వార్డు సభ్యులు వొన్న తిరుపతిరావు, ఇందారపు చంద్రయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
